సాంఘికశాస్త్రంతో సామాజిక అవగాహన | - | Sakshi
Sakshi News home page

సాంఘికశాస్త్రంతో సామాజిక అవగాహన

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

కందనూలు: సాంఘిక శాస్త్రంతో సామాజిక అవగాహన పెంపొందుతుందని డీఈఓ రమేశ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల వేదిక, క్లాస్‌మెట్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 100/100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఓ అద్దంలా సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుందన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షలో 100/100 మార్కులు సాధించడం కఠినంతో కూడిన విషయమని.. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని అన్నారు. సాంఘిక శాస్త్రంలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న క్లాస్‌మెట్‌ క్లబ్‌ సభ్యులతో పాటు, సోషల్‌ ఫోరం సభ్యులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్‌, కృష్ణమోహన్‌, తీగల జనార్దన్‌, డా.ప్రపుల్‌చంద్రారెడ్డి, సౌజన్య కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement