62 రేడియల్‌ క్రస్టు గేట్లు | - | Sakshi
Sakshi News home page

62 రేడియల్‌ క్రస్టు గేట్లు

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 రేడియల్‌ క్రస్టు గేట్లు ఉన్నాయి. ఇందులో 4, 8, 12, 19, 21, 25, 27, 31, 41, 45, 51 గేట్ల రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడినట్లు 20 19లోనే అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి మరమ్మతులపై ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది.

మరమ్మత్తులు పూర్తిచేస్తాం....

జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– రహీముద్దీన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌ శాఖ

Advertisement
 
Advertisement
Advertisement