పోలీసు సేవల్ని వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

పోలీసు సేవల్ని వినియోగించుకోండి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్‌ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ పనిచేస్తుందన్నారు. ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన 10 అర్జీలలో భూమికి సంబంధించి 5, తగు న్యాయం కోసం 5 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement