ఎట్టకేలకు మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మరమ్మతు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాలకు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపులు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్‌ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపు లు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇను ప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏ ర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రా ష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మ తు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది.

నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు..

జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్‌లో ఉంచారు.

టెండర్‌ ప్రక్రియ పూర్తి..

జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్‌ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

మంత్రి పర్యటనతో..

జూరాల గేట్లకు రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్‌తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది.

జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు

తాజాగా 42 ఇనుప రోపులపునరుద్ధరణ

ఇదివరకే 10 రోపులకు కొనసాగుతున్న పనులు

ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement