ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

కందనూలు: ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ ప్రజల నుంచి 35 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలకు పరిష్కారం చూపుతారనే ఆశతో ప్రజలు ప్రజావాణికి వస్తారని అధికారులు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులపై దృష్టిసారించాలి

తాడూరు: గ్రామీణ ప్రాంతాల రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు అన్నారు. సోమవారం ప్రజా ప్రభుత్వం– ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో క్లస్టర్‌ రైతువేదికల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వాడకం, సహజ వ్యవసాయం, వరిలో ప్రాధాన్యత రకాలు, మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. అలాగే మండలంలోని ఇంద్రకల్‌ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమానికి వ్యవసాయ జాయింట్‌ డైరెక్టర్‌ మార్కెటింగ్‌ పద్మహర్షతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్‌, సహాయ సంచాలకుల పూర్ణశేఖర్‌ హాజరయ్యా రు. రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ సాగులో అధికారులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడి సాధించేలా ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సందీప్‌కుమార్‌రెడ్డి, ఉద్యాన శాఖా ధికారి జగన్‌, ఉపసర్పంచ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement