అచ్చంపేట రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యానాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సీపీఎం బృందం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది. అమ్మకానికి తెచ్చి ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ఉండి పోతుందని, సకాలంలో తూకం వేయక పోవడం, తూకం వేసిన ధాన్యాన్ని తరలించక పోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. యార్డులో కనీస సౌకర్యాలు కల్పించకపోతే ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సీపీ ఎం నాయకులు వెంకటయ్య, పర్వతాలు, వాల్యానాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.


