వెల్దండ: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని కొట్రలో ఆదివారం కంఠ మహేశ్వరస్వామి దేవాలయంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీసింగ్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శారద, నాయకులు భూపతిరెడ్డి, ఆనంద్‌కుమార్ సంజీవ్‌కుమార్, బచ్చు రామకృష్ణ, హరికిషన్‌నాయక్, సురేందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు శేఖర్‌రెడ్డి, బాలస్వామి, గౌడ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.


