సంఘర్షణ నిర్మూలన కోసం.. | - | Sakshi
Sakshi News home page

సంఘర్షణ నిర్మూలన కోసం..

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

సంఘర్షణ నిర్మూలన కోసం..

అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్‌బైల్‌, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement