జీవనోపాధి కావాలి.. | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి కావాలి..

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

జీవనోపాధి కావాలి.. పరిహారం ఇస్తేనే వెళ్తాం.. బలవంతం లేదు..

ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్‌ చేపట్టాలి. పునరావాసంతోపాటు జీవనోపాధి కల్పించాలి.

– పోషప్ప, కుడిచింతల్‌బైల్‌,

అమ్రాబాద్‌ మండలం

అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి.

– మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్‌ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. రీలొకేషన్‌ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం.

– రేవంత్‌చంద్ర, ఐఎఫ్‌ఎస్‌

అధికారి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement