నేడు అభ్యర్థులకు ఇంటర్వ్యూ | - | Sakshi
Sakshi News home page

నేడు అభ్యర్థులకు ఇంటర్వ్యూ

May 1 2026 8:20 AM | Updated on May 1 2026 8:20 AM

కందనూలు: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందించే ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పుర కమిషనర్‌ నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌ఫొటో తీసుకురావాలని ఆయన సూచించారు.

ఇరిగేషన్‌ సీఈగా

సత్యనారాయణరెడ్డి

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): నీటి పారుదల శాఖ సీఈగా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి శ్రీధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈయన నీటి పారుదల శాఖ ఎస్‌ఈగా ఉన్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ డీఈగా ఉన్న ప్రభాకర్‌రెడ్డికి ఈఈగా పదోన్నతి లభించింది. సర్కిల్‌–2 డీఈగా ఉన్న ఈయన్ను పదోన్నతిపై సర్కిల్‌–4 ఈఈగా నియమించారు. అలాగే పెబ్బేరు సర్కిల్‌ ఈఈగా ఉన్న కేశవరావుకు అదే సర్కిల్‌–6కు ఈఈగా నియమించారు.

ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

తిమ్మాజిపేట: ఉపాధిహామీ పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఓ చిన్న ఓబులేషు హెచ్చరించారు. గురువారం తిమ్మాజిపేట మండల కేంద్రంతోపాటు గుమ్మకొండ, ఎదిరేపల్లి గ్రామాల్లో ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎదిరేపల్లిలో కూలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున కూలీలు ఉదయం 6గంటల్లోగా పనులకు రావాలని సూచించారు. అనంతరం తిమ్మాజిపేటలో నర్సరీని పరిశీలించారు. నర్సరీలో కొన్ని మొక్కలు ఎండిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఏపీఓ సత్యనారాయణ ఉన్నారు.

మెగా జాబ్‌మేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్‌మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్‌మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్‌ మేళాలో హైదరాబాద్‌ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్‌, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్‌, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్‌ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పలువురు మంత్రుల రాక..

మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్‌లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్‌ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళా కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement