ఉమామహేశ్వరాలయ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉమామహేశ్వరాలయ అభివృద్ధికి కృషి

May 1 2026 8:20 AM | Updated on May 1 2026 8:20 AM

అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రం ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుడు కట్టా సుధాకర్‌రెడ్డి అన్నారు. శ్రీశైలంలో గిరిప్రదక్షిణ సందర్భంగా గురువారం ఉమామహేశ్వర ఆలయంలో స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానంలో ఈ నెల 27నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన గిరిప్రదక్షిణ సందర్భంగా శ్రీశైలానికి నాలుగు ముఖద్వారాలైన త్రిపురాంతకం, జ్యోతి సిద్ధపటం, అలంపూర్‌ జోగుళాంబ, ఉమామహేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచే ఉమహేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగిందని.. ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీశైల ఆలయ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, ఏపీఆర్‌ఓ శేఖర్‌రెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, అర్చకుడు వీరయ్యశాసీ్త్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement