కందనూలు: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్, కార్మికశాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ లేబర్ అధికారి రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రాథమిక దశలోనే లోపాలను గుర్తించాలి
కందనూలు: చిన్నారుల శారీరక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.రవికుమార్ సూచించారు. గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో బాలభరోసా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారుల్లో శారీరక, మా నసిక అభివృద్ధిలో లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం చిన్నారుల సేవలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


