క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

వీపనగండ్ల: క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం లభించడమేగాక క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని కల్వరాలలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి వాలీబాల్‌ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. శిక్షణతో గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండారి రాముడు, ఉపసర్పంచ్‌ తడకల రంగమ్మ, జీహెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీ శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్‌, భాస్కర్‌, శివుడు, వెంకట్‌, గోపాల్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement