ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగా కండక్టర్లు, డ్రైవర్లను నియామకం చేసుకొని బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. బుధవారం సాయంత్రం వరకు పది మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించి.. కొన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు నడిపించాం.
– యాదయ్య,
డిపో మేనేజర్, నాగర్‌కర్నూల్
చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నాం. యాజమాన్యం నుంచి మాకు తీవ్రమైన ఒత్తిడి ఉంది. నూతన రిక్రూట్‌మెంట్ లేక ఉన్న వారితో సరిపెడుతూ మమ్మల్ని డబుల్ డ్యూటీల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఆర్టీసీ కార్మికులను విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
– స్వరాజ్యలక్ష్మి,
కండక్టర్, నాగర్‌కర్నూల్ డిపో
నేను షాద్‌నగర్‌లో నా కొడుకు దగ్గరకు వెళ్లాలి. ఉదయం అచ్చంపేట నుంచి ఒక బస్సు వస్తే దానిలో వచ్చాను. నాగర్‌కర్నూల్‌కు వచ్చాక ఇక్కడ ఒక్క బస్సు లేదు. ఈ రోజు బస్సులు నడుస్తలేవు అని ముందుగా తెలియదు. జడ్చర్ల వరకు ఆటోలు వెళ్తున్నా.. వాళ్లు రూ.150 అడుగుతున్నారు.
– లక్ష్మమ్మ,
రామాజిపల్లి, బల్మూరు మండలం
ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మేం ప్రతిరోజు కళాశాలకు బస్సుల్లో వెళ్తాం. ఇలాంటి సమయంలో బస్సులు నడవకపోవడంతో సరైన సమయంలో పరీక్షకు హాజరుకాలేకపోతున్నాం. ఆర్టీసీ అధికారులు ఆలోచించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– శివ, డిగ్రీ విద్యార్థి
●


