వెల్దండ: ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధం చేసుకునే విధంగా లబ్ధిదారులను పురమాయించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పోతేపల్లి, ఎంజీ కాలనీతండాలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులు శుక్రవారం గృహ ప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధి హామీ పనులు, గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల వద్ద నీరు, నీడ వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కొండల్‌యాదవ్, దస్లీ, శిరీష, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంపీఓ లక్ష్మణ్, ఏపీఓ ఈశ్వర్‌జీ, ఈసీ దేవేందర్, హౌసింగ్ ఏఈ పల్లవి, కృష్ణవేణి, కార్యదర్శులు రూప్‌సింగ్, వాణి, తదితరులు పాల్గొన్నారు.


