పేదలకే సంక్షేమ ఫలాలు.. | - | Sakshi
Sakshi News home page

పేదలకే సంక్షేమ ఫలాలు..

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి, అనర్హులుగా ఉండి కూడా రేషన్‌కార్డులు పొందిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన రేషన్‌కార్డుల ప్రక్షాళన ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. కొంతకాలంగా అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 4,500ల దాకా అనర్హులు తెల్లరేషన్‌కార్డులు పొందినట్లుగా గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులు, వాహనాలు, భూమి వివరాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను(ఇన్‌కంటాక్స్‌) చెల్లిస్తున్న వారిపై అధికారులు దృష్టిసారించారు. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే వ్యక్తులు తెల్లరేషన్‌కార్డు పొందేందుకు అనర్హులు. అయినప్పటికీ పలువురు ఈ సమాచారాన్ని దాచిపెట్టి కార్డులు పొందినట్లుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. అలాంటి వారి కార్డులు తక్షణమే రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

కార్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ చెల్లింపుదారులకూ కార్డులు

విచారణ చేపడుతున్న రెవెన్యూ అధికారులు

పరిశీలించి తొలగింపునకు చర్యలు

అచ్చంపేట: అక్రమ రేషన్‌ కార్డులు పొందిన అనర్హులకు చెక్‌ పడనుంది. జిల్లాలో మొత్తం 2,76,590 రేషన్‌ కార్డులుండగా.. ప్రభుత్వం ప్రతినెలా 5,554.3 మె.ట., బియ్యం ఉచితంగా అందజేస్తోంది. అయితే పలువురు ప్రతినెలా తీసుకుంటున్న రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా దృష్టిసారించాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించి 4,500 కార్డుదారులు అనర్హులుగా ఉన్నారని కేంద్రం తేల్చి.. వీటిని తొలగించాలని ఆదేశించారు.

ఆహార భద్రత 2,57,886

Advertisement
 
Advertisement
Advertisement