ఆయా మున్సిపాలిటీల్లో కోఆప్షన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పలు కారణాలతో కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం రానివారు కోఆప్షన్ పదవులు ఆశిస్తున్నారు. చైర్మన్ ఎన్నికకు సరిపడా బలం లేని మున్సిపాలిటీల్లో పరోక్షంగా మద్దతు తెలిపిస వారికి గతంలో అధికార పక్షం అగ్రనేతలు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కోఆప్షన్‌గా ఎన్నికై న వారికి నెలనెలా గౌరవ వేతనంతోపాటు ఇతర సదుపాయాలు ఉండటంతో పదవిని ఆశించే వారి సంఖ్య అన్ని మున్సిపాలిటీల్లో పరిమితికి మించి ఉండే అవకాశం ఉంది.


