నేటి నుంచి ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఓపెన్‌ ఇంటర్‌, ఎస్సెస్సీ పరీక్షలు

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

కందనూలు: జిల్లాలో సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఎస్సెస్సీకి సంబంధించి జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ పట్టణాల్లో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో మొత్తం 492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు 7 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 87 మంది ఇన్విజిలెటర్లు, 11 మంది సీఎస్‌లు, 11 మంది డిపార్టుమెంట్‌ అధికారులను నియమించినట్లు ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ శివప్రసాద్‌ వివరించారు. హాల్‌ టికెట్లను తెలంగాణ ఓపెన్‌స్కూల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

అన్ని ఏర్పాట్లు చేశాం..

జిల్లాలో ఓపెన్‌ ఎస్సె స్సీ, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్ష రాయాలి. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం.

– రమేశ్‌కుమార్‌, డీఈఓ

Advertisement
 
Advertisement
Advertisement