ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తుందని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని, వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చలకు రావడం లేదని ప్రశ్నించారు. విధానపరమైన సమస్యలు అంటూ ప్రజలను గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విధానపరమైన సమస్యలు అనడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకురావాలని, ఆర్టీసీ కార్మి సంఘాలతో చర్చించి.. ఈ నెల 22 నుంచి జరిగే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు జీఎల్‌గౌడ్‌, నాగేందర్‌, కృష్ణ, వెంకటయ్య, నాగరాజు, గోపాల్‌, కురుమూర్తి, సురేష్‌, ఖమర్‌అలీ, భరత్‌, ప్రశాంత్‌, రాజ్‌కుమార్‌, ప్రేమలత, నారాయణ, శివరాం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement