జనగణన బాధ్యతగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన బాధ్యతగా నిర్వహించాలి

Apr 19 2026 8:11 AM | Updated on Apr 19 2026 8:11 AM

కందనూలు (తాడూరు): జిల్లాలో జనగణన సర్వేను బాధ్యతగా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో మొత్తం 36 మంది ఎన్యూమరేటర్లుగా వ్యవహరిస్తున్న అందరికీ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా జనాభా సర్వే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కానీ, ఈసారి జనాభా సర్వే కొంత ఆలస్యంగా మే 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో సంబంధిత సిబ్బంది పూర్తి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించా రు. తహసీల్దార్‌ రామకృష్ణయ్య, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంఈఓ త్యాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement