నీటికుంటలు, సోలార్ పంపులు, ర్యాంపువెల్స్ లేని ఎత్తైన ప్రాంతాల్లో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్‌క్యాంపు సిబ్బంది, బీట్ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లు నింపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఐసీఐసీ ఫౌండేషన్ నుంచి 5 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకులను ఉచితంగా అందజేయగా కొన్ని రేంజ్‌ల పరిధిలో నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో అత్యధికంగా సాసర్‌ల ద్వారా నీటిని అందించేవారు. దీంతో ట్రాక్టర్ శబ్దానికి వన్యప్రాణులు భయపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి కొంత మేర తగ్గించి సహజ వనరులపై దృష్టి సారించారు. నిఘా ఉంచేందుకు ఒక్కో సాపర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


