భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

ములుగు: భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి పక్కా ప్రణాళిక రూపొందించి, పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌ అదనపు కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూముల రీ సర్వే, బృందాల ఏర్పాటు, భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు వంటి సమస్యలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ పాత భూభారతి విధానంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ నవంబర్‌ 15లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. నూతన భూభారతి విధానంలో అందే దరఖాస్తులను స్వీకరించిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే భూముల రీ సర్వే పనులు సక్రమంగా సాగేందుకు బృందాల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీటీ నితీశ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వీసీలో భూ పరిపాలన

ప్రధాన కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement