● అదనపు కలెక్టర్ సంపత్‌రావు
ములుగు: పండుగ సాయన్న పేద ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయన్న పేదల అభ్యున్నతికి పోరాడిన గొప్ప యోధుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జిల్లా అధ్యక్షుడు ఏర్ల వెంకన్న, మెపా జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్, సామాజిక ముదిరాజ్ న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శానబోయిన అశోక్, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


