విద్యుత్‌ ఉచ్చులు పెడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉచ్చులు పెడితే కఠిన చర్యలు

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

ములుగు రూరల్‌: అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు పంట పొలాల చుట్టూ విద్యుత్‌ ఉచ్చులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు డీఎస్పీ రవీందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల కోసం ఏర్పాటు చేసే ఉచ్చులతో మనుషుల ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఇటీవల కాలంలో జిల్లాలోని జాకారం పంచాయతీ పరిధిలో విద్యుత్‌ ఉచ్చులో పడి పలువురు మృతి చెందగా సదరు వ్యక్తి జైలుపాలు అయ్యాడని గుర్తుచేశారు. ఎవరైనా విద్యుత్‌ ఉచ్చులు పెట్టినట్లు తెలిసినా, కనిపించినా పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement