జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో డిజిటల్ క్రాప్ సర్వేలో నెట్ వర్క్ సమస్యతో పూర్తి స్థాయిలో పంటల వివరాలు యాప్‌లో నమోదు చేయలేకపోయాం. ఈ నెల 27 వరకు క్రాప్ బుకింగ్ సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. మ్యానువల్ నమోదుకు అనుమతులు ఇవ్వాలని నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతులు వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. క్రాప్ సర్వేలో జిల్లా ముందంజలో నిలిపిన అందుకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తర్ణ అధికారులకు అభినందనలు.
– సురేశ్‌కుమార్, డీఏఓ
●


