అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Oct 23 2026 1:03 AM | Updated on Oct 23 2026 1:03 AM

● కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌

సహదేవరావు

ములుగు: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ గడువులోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రోడ్లు, భవనాలు, నీటిపారుదల, పర్యాటక, పంచాయతీరాజ్‌, మిషన్‌న్‌ భగీరథ, ఎన్పీడీసీఎల్‌, తదితర శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్‌ గురువారం అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని సూచించారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించి, నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యంగ్‌ ఇండియా పాఠశాల, వైద్య కళాశాల పనులు, ఇతర మరమ్మతు పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. పుష్కరాలకు సంబంధించిన పనులను వేగంగా చేపట్టాలన్నారు. జంపన్నవాగు అభివృద్ధికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రామప్ప ఐలాండ్‌, పర్యావరణ ఉద్యానవనం, ప్లాజా, పరిపాలనా భవనాలు, ఎకో టూరిజం విలేజ్‌, ప్రసాద్‌ పథకం కింద చేపట్టిన పర్యాటక సమాచార కేంద్రం పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఫోన్‌ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, జిల్లా అధికారులు అప్పలనాయుడు, ధర్మానాయక్‌, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement