పరిహారమేది? | - | Sakshi
Sakshi News home page

పరిహారమేది?

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

రైతుబీమాకు మంగళం..

ఇందిరమ్మ బీమా అమలయ్యేనా..

ఏటూరునాగారం: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం కనుమరుగైపోయింది. జిల్లాలో ఇటీవల వివిధ కారణాలతో పలువురు రైతులు మృతి చెందగా వారి కుటుంబాలకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం నవంబర్‌లో ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకొస్తామని చెబుతోంది. పాత పథకం రెన్యూవల్‌ కాకపోవడంతో ఈ మధ్య కాలంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలోని పది మండలాల్లో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో రైతుల ఎవరూ మృతి చెందలేదు. మిగతా ఏడు మండలాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఇప్పటి వరకు అందలేదు.

రూ.5 లక్షలతో భరోసా

గత ప్రభుత్వం 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతీ రైతుకు రైతు బీమా పథకంలో భాగంగా పరిహారం అందజేసింది. ఎలాంటి కారణంతో మృతి చెందినా బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. రైతు బీమా ప్రీమియం గడువు ఆగస్టు 13 వరకు ఉండగా ప్రభుత్వం రెన్యూవల్‌ చేయకపోవడంతో ప్రీమియం గడు వు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వీరికి బీమా వర్తించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏం చూపిస్తుందని బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.

బీమాసొత్తు కోసం నిరీక్షణ

రైతు బీమా పథకానికి జిల్లాలో 41,013 మంది రైతులు అర్హత పొందారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు మండలంలో అధికంగా 6,889 మంది, వెంకటాపురం(ఎం) మండలంలో 6,432 మంది రైతులకు బీమా ఉంది. నవంబర్‌ 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈలోగా మృతి చెందినవారి విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. బీమాకు అర్హులైన ఇటీవల మృతి చెందిన రైతుల వివరాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నమోదు చేసుకుంటున్నారు. వీరు సైతం ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. పాతప్రీమియం గడువు ముగిసి రెండు నెలలు అవుతుంది. కొత్త పథకం అమల్లోకి రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలు తమకు బీమా వర్తింపజేయాలని అధికారులను కోరుతున్నారు.

ఇటీవల మృతి చెందిన రైతు

కుటుంబాలకు అందని బీమా సొత్తు

బాధిత కుటుంబాల ఎదురుచూపులు

పట్టించుకోని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement