పూజితకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

పూజితకు సన్మానం

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

శోభాయమానం భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవం

ములుగు రూరల్‌: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలలో కాంస్య పతకం సాధించిన మండల పరిధిలోని జగ్గన్నపేటకు చెందిన విద్యార్థి పూజితను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సన్మానించారు. ఈ మేరకు బుధవారం విద్యార్థి ఎట్టి పూజితను మంత్రి శాలువాలతో సన్మానించి మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు, జగ్గన్నపేట గ్రామానికి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలలో కాంస్య పతకం సాధించేలా తీర్చిదిద్దిన కోచ్‌ సతీష్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ జగదీశ్‌, పీఈటీ భూషన్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యతా పతాకం ఆవిష్కరణ

ములుగు రూరల్‌: మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్‌గౌస్‌ పల్లిలో విజయదశమి సందర్భంగా సమైక్యతా పతాకం ఆవిష్కరించారు. ఈ మేరకు మంగళవారం దసరా పండుగ సందర్భంగా అనాదిగా వస్తున్న ఆచారం మేరకు గ్రామ కూడలి వద్ద తెల్లజెండాను సర్పంచ్‌ పసుల కార్తీక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐక్యతకు చిహ్నంగా విజయదశమి రోజున శాంతి జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

‘దళితులపై దాడులు

సహించం’

ములుగు: వెంకటాపురం(ఎం) మండల పరిధి లోని దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని న ర్సింగాపూర్‌ సర్పంచ్‌ రాజేశ్వరి, రామానుజపూర్‌కు చెందిన సుధాకర్‌పై జరిగిన దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, దళితుల హక్కులు, ప్రా ణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దాడులు పునరావృతమైతే బీఆర్‌ఎస్‌ పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

హన్మకొండ కల్చరల్‌: దేశీ శరన్నవరాత్రోత్సవాల ముగింపులో భాగంగా బుధవారం శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్నాహికం, శతఘటాభిషేకం నిర్వహించా రు. రాత్రి 8 గంటలకు శోభాయమానంగా అలంకరించి వేదికపై భద్రకాళీభద్రేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. వివాహమహోత్సవా న్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లు కడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర వివాహతంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగళ్యధారణ తదితర విధులను శాస్త్రోక్తంగా జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement