ములుగు రూరల్: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, అమరుల కులుంబాలకు ఎల్ల వేళలా అండగా ఉంటామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అమరవీరు ల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. పోలీసులు ప్రజల పట్ల బాధ్యత, ని బద్ధతతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో మావోయిస్టులు, దేశంలో టెర్రరిజం నిర్మూళనకు పోలీసులు చేసిన కృషి గుర్తింపు తెచ్చిందని వివరించారు. ఇక్కడ పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు అన్ని రాష్ట్రాల పోలీసులు ఆదర్శంగా తీసుకున్నారని వివరించారు. మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత దేశంగా మార్చడంతో పాటు తెలంగాణ పోలీసులు చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని వివరించారు. యువతను సరైన దిశలో నడిపించేందుకు నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. అదే విధఃగా ప్రస్తుతం ఫ్రీ కోచింగ్ అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ మమన్ భట్, అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు దయాకర్, సురేశ్, సూర్య ప్రకాశ్, రమేశ్, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


