హేమాచలుడి ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

హేమాచలుడి ఊరేగింపు

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో శ్రీ హే మాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బుధవారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. విజయదశమి(దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని దేవతా మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో ఆలంకరించి పల్లకి(సేవ) పై సాయంత్రం మేళ తాళాలు, మంగళ వాయిద్యా ల నడము గుట్టపై నుంచి రాత్రి 8 గంటలకు మల్లూ రు గ్రామానికి తీసుకొచ్చారు. స్వామివారిని విశ్రాంతి మండపంపై ఉంచి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉత్సవ మూర్తులను గ్రామంలోని పుర వీధుల్లో ఊ రేగింపు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఉత్సవ మూర్తులకు గ్రామస్తులు నీళ్లారబోసి టెంకాయలు కొట్టి దర్శించుకున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం విజయదశమి(దసరా) పండుగ రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పండుగ తెల్లవారి నిర్వహించడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆలయ అధికారులు మాత్రం పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ రోజు నిర్వహిస్తున్నామని, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కూడా ఈరోజే నిర్వహిస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement