వామ్మో.. అన్నారం బ్యారేజీలో మొసలి! | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. అన్నారం బ్యారేజీలో మొసలి!

Oct 22 2026 3:44 AM | Updated on Oct 22 2026 3:44 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం బ్యారేజీ వద్ద ఓ మొసలి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా బ్యారేజీ సమీపంలో మొసలి సంచరిస్తున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారుల ద్వారా తెలిసింది. ఎల్‌మడుగులోని శివ్వారం మెసళ్ల అభయారణ్యం నుంచి గోదావరి ప్రవాహంలో కొట్టుకొచ్చి మొసలి అన్నారం బ్యారేజీ వద్దకు చేరి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. బరాజ్‌కు దిగువన 20 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. మొసలి అటు వైపు వెళ్తే భక్తులకు ప్రమాదం తప్పని పరిస్థితి. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలి సంచారాన్ని గుర్తించడంతోపాటు సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గతంలోనూ మొసలి సంచారం..

ఐదేళ్ల క్రితం బరాజ్‌ దిగువన పలుగుల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోనూ గోదావరి నుంచి వచ్చిన మొసలి కలకలం సృష్టించింది. అప్పట్లో స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement