ప్రతాపగిరి బీట్‌లో ఫుట్‌ పెట్రోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతాపగిరి బీట్‌లో ఫుట్‌ పెట్రోలింగ్‌

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

మల్హర్‌(కాటారం): మండలంలోని కాటారం ప్రతాపగిరిలో ప్రసిద్ధ ప్రతాపగిరి గుట్టను సోమవారం జిల్లా అటవీ అధికారి జె.కృష్ణాగౌడ్‌, మహదేవపూర్‌ ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ ఎం.సందీప్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతాపగిరి బీట్‌లో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి గొంతెమ్మ గుట్టచరిత్ర దాని చారిత్రక ప్రాధాన్యతను అడిగి తెలుసకున్నారు. గుట్టపై ఉన్న అటవీ సంపద, వన్యప్రాణుల ఆవాసాలు, భక్తుల రాకపోకలకు ఉన్న సౌకర్యాలు, అటవీ రక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుట్ట పరిసరాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. గుట్టను సందర్శించే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంలో స్థానిక ప్రజల సహకారం తీసుకోవాలని అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజర్‌ జె.స్వాతి, డీఆర్వో సురేందర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement