‘సఖి’తో భరోసా! | - | Sakshi
Sakshi News home page

‘సఖి’తో భరోసా!

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

– ప్రేమలత, డీడబ్ల్యూఓ

ములుగు రూరల్‌: మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణించినప్పటికీ సమాజంలో మహిళలు నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, బాల్య వివాహాల నివారణకు తక్షణ సాయం కోసం ప్రభుత్వం సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. సఖి కేంద్రాల ద్వారా మహిళలపై జరుగుతున్న వేధింపులకు రక్షణ కల్పిస్తూ బాధితులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సఖి కేంద్రం సభ్యులు మహిళలు, యువతులకు అందించే పోలీస్‌, న్యాయ, వైద్య సహాయం, వసతి, ఫిర్యాదు విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు. సఖి కేంద్రాలు మహిళలు, యువతులు, బాలికల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

బాధితులకు కౌన్సెలింగ్‌..

జిల్లాలోని పది మండలాల్లో సఖి కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు సామాజిక చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేధింపులకు గురైన మహిళలు, యువతులకు సఖి కేంద్రం అందిస్తున్న సేవలను తెలియజేస్తున్నారు. వేధింపులకు గురైన మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారికి కౌన్సెలింగ్‌తో పాటు సమస్యలపై పోలీస్‌, ఉచిత న్యాయ సహాయం అందించి బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నారు.

ఉచిత న్యాయ సహాయం

వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే సఖి కేంద్రం నిర్వాహకులు బాధిత మహిళను సఖి కేంద్రానికి తరలించి ఐదు రోజుల పాటు పిల్లల సంరక్షణ, భోజనం, వసతితో పాటు వైద్యం, పోలీస్‌, ఉచిత న్యాయం, ఆర్థిక సహాయం అందిస్తారు. బాధితులకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తారు. బాధిత మహిళలు రక్షణాధికారి, జిల్లా సంక్షేమాధికారి లేదా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస, లైంగిక, వరకట్న వేధింపులు వంటి వాటిపై హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181ను ఆశ్రయించవచ్చు.

సఖి కేంద్రం సేవలు..

సఖి కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సోషల్‌ కౌన్సెలింగ్‌ 1,617 మందికి నిర్వహించారు. అలాగే 926 మంది బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి 1022 మందికి వైద్య సదుపాయం కల్పించారు. అలాగే పలు పోలీస్‌ సపోర్టు 148 మందికి కల్పించడంతో పాటు 162 మందికి వసతి కల్పించారు. అలాగే 270 మంది పిల్లలను సంరక్షణతో పాటు 1,005 మందికి అవగాహన కల్పించారు. 111మందిని సదరం హోంకు తరలించారు.

ఆపదలో అండగా ఉంటాం..

మహిళలు, బాలికలకు ఆపద సమయంలో సఖీ కేంద్రం అండగా నిలుస్తుంది. సహాయం కోరిన వారికి వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. బాధిత మహిళలకు వైద్యం, పోలీస్‌, ఉచిత న్యాయం, భోజనం అందించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తాం. ఆపద సమయంలో 181 హెల్ప్‌లైన్‌ నంబర్‌ లేదా 08715 2951281, 7013745008 నంబర్లలో సంప్రదించాలి.

బాధిత మహిళలకు

అండగా నిలుస్తున్న కేంద్రం

ఉచిత పోలీస్‌, వైద్యం, వసతి,

న్యాయ సహాయం

అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

కేసు అందిన పరిష్కరించినవి పెండింగ్‌లో

ఫిర్యాదులు ఉన్నవి

గృహహింస 725 603 122

వరకట్నం కేసులు 8 8 00

బాలికలపై లైంగిక దాడులు 52 47 05

బాల్య వివాహాలు 44 41 03

మిస్సింగ్‌ 46 45 01

చీటింగ్‌ 45 43 02

ప్రేమించి మోసం 63 61 02

సీనియర్‌ సిటీజన్‌ 02 02 00

ఆస్తి తగాదాలు 15 15 00

ఇతర కేసులు 46 43 03

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement