నేటి పొదుపే రేపటి భరోసా | - | Sakshi
Sakshi News home page

నేటి పొదుపే రేపటి భరోసా

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

నేటి పొదుపే రేపటి భరోసా

విజయ‘దశ’మి సూత్రాలు పాటిద్దాం.. ఎల్‌నినోను జయిద్దాం!

ప్రత్యామ్నాయ పంటలతోనే సాగునీటి ఆదా..

వ్యవసాయంలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేయడం, బిందు సేద్యం వంటి పద్ధతులను అనుసరించడం వల్ల సాగునీటిని సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో వర్షాకాలం సీజన్‌లో సగటున 26.7 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వానా కాలంలో అన్ని పంటలు కలిపి 14,48,052 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 6,91,997 ఎకరాలు, మొక్కజొన్న 1,00,976, పత్తి 7,99,799 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు వద్దని చెబుతోంది. ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తోంది.

హన్మకొండ కల్చరల్‌: చెడుపై మంచి సాధించిన విజయానికి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ మనిషి జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి, సమాజ అభ్యున్నతికి కృషి చేయడానికి స్ఫూర్తిగా తీసుకోవాలి. విజయదశమి చెడుపై మంచిసాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ మనం ఈ విజయదశమి నుంచి మార్పు మనతోనే ప్రారంభించాలి. దశమి అంటే పది.. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ స్ఫూర్తితో.. వాతావరణ మార్పుల రూపంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఉమ్మడి వరంగల్‌ ప్రజలు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. పండుగ వేళ పది పొదుపు సూత్రాలను ఆచరణలో పెట్టడం ద్వారా ప్రకృతి వనరులను కాపాడుకోవడంతోపాటు భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కోవచ్చు.

విద్యుత్‌ పొదుపు ముఖ్యం..

వర్షాలు లేకపోవడం, ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యుత్‌ విని యోగం విపరీతంగా పెరిగింది. సాగు కోసం భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్‌ వినియోగం పెరిగింది. కూలర్లు, ఏసీల వినియోగం కొనసాగుతోంది. టీజీఎన్పీడీసీఎల్‌ పరిధిలో సెప్టెంబర్‌ 9న వేసవిని మించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైంది. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను ఆపేయడం, ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలను వినియోగించడం ద్వారా విద్యుత్‌ వృథాను అరికట్టవచ్చు.

ప్రకృతికి పచ్చని కవచం..

విజయదశమి సందర్భంగా పచ్చదనాన్ని కాపాడుకోవడం, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచడం, సహజ నీటి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు నీటి భద్రతను మెరుగుపర్చగలం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం అసమానంగా ఉంది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా–2023 నివేదిక ప్రకారం.. ములుగు జిల్లాలో భౌగోళిక విస్తీర్ణంలో 64.64 శాతం అటవీ కవర్‌ ఉండగా, జయశంకర్‌ భూపాలపల్లిలో 41.15 శాతం, మహబూబాబాద్‌లో 26.49 శాతం ఉంది. మరోవైపు వరంగల్‌లో 3.53 శాతం, హనుమకొండలో 3.40 శాతం అటవీ కవర్‌ మాత్రమే నమోదైంది. పచ్చదనం, జీవవైవిధ్యం, నేల సంరక్షణ, స్థానిక వాతావరణ సమతుల్యతకు అడవులు కీలక పాత్ర పోషిస్తాయి.

1

ప్రతీ ఇంటి నుంచి మార్పు మొదలు పెట్టాలి..

వాతావరణ అనిశ్చితిపై అప్రమత్తత..

సాగు, తాగునీరు, విద్యుత్‌ పొదుపు ముఖ్యం

3

2

4

2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement