ప్రజలు సంతోషంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు సంతోషంగా ఉండాలి

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

● రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సల్లంగా ఉండాలని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆకాంక్షించారు. ములుగు పట్టణంలోని రామాలయంలో సోమవారం తొమ్మిదో రోజు అమ్మవారిని మహిషాసురమర్ధినిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించగా మంత్రి సీతక్క హాజరై పూజలు నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణతో పాటు లోకకల్యాణం కోసం మహిషాసురమర్ధిని అవతరించిందని సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనుగుల సాంబలక్ష్మీసాయిలు దంపతుల కుమారులు ప్రకాశ్‌, విజయ్‌, నవీన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. పండుగల సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, ఇమ్మడి రాకేశ్‌యాదవ్‌, మేడికొండ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, నాయకులు పల్లె జైపాల్‌రెడ్డి, ఏలూరి నారాయణరెడ్డి, గట్ల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement