భూపాలపల్లి: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై శుక్రవారం భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చెప్పారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలి పారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, సైబర్ నేరగాళ్లు చెప్పే ఆకర్షణీయమైన ఆఫర్లు, అధిక లాభాల ఆశలకు లోనుకావద్దన్నారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


