ఏటూరునాగారం: విద్యుత్ కోతలతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ రిపేరుతో అధికారులు కాలయాపన చేస్తున్న తీరుపై బుధవారం సాక్షిలో సాగునీటి కష్టాలు శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై విద్యుత్‌శాఖ డీఈ పురుషోత్తం స్పందించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను రైతులకు అందజేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరిపంటకు కావాల్సినంత నీటిని అందించాలని,అందుకు అను గుణంగా సరఫరా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విద్యత్‌శాఖ అధికారులు అందజేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎడ్లబండిలో కట్టుకొని పొలం వద్దకు తరలించారు. విద్యుత్‌శాఖ సిబ్బంది, రైతులు కలిసి దానిని అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.


