‘నిర్భయ నిధి’కి జిల్లా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘నిర్భయ నిధి’కి జిల్లా ఎంపిక

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

ములుగు: మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన సమగ్ర పట్టణాల అభివృద్ధికి చేపట్టనున్న ప్రయోగాత్మక ప్రాజెక్టు నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపికై ంది. ఈ ప్రాజెక్టు అమలు, కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు అమలుకు అవసరమైన ప్రణాళికలు, వివిధ శాఖల భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళలు, బాలికల భద్రతకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లాలో ప్రతిపాదిత కార్యక్రమాలు, సంబంధిత శాఖల సమన్వయం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలు, బాలికలకు సురక్షితమైన ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయడంతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. సమాన అవకాశాలు, సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించనున్నారు. భద్రతపై అవగాహన కార్యక్రమాలు, మహిళల సాధికారత, ప్రభుత్వ శాఖల సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మహిళా ఉద్యోగులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలు తమ సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు, విజయాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించుకునేందుకు అనువైన వేదికను కల్పించే అంశాన్ని కూడా ప్రాజెక్టు ప్రణాళికలో పరిశీలించనున్నారు. ఇందుకోసం ‘నిర్భయ సదన్‌’ వంటి ప్రతిపాదిత కార్యక్రమాలను పరిశీలించనున్నారు. జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపిక కావడంతో మహిళలు, బాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్‌ వెల్లడించారు.

న్యూఢిల్లీలో సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement