నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

ములుగు రూరల్‌: నిరంతర విద్యుత్‌ సరఫరాకు టీజీఎన్‌పీడీసీఎల్‌ ప్రత్యేక చర్యలు చేపడుతుందని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. వ్యవసాయ అవసరాలకు, ఏసీలకు, కూలర్లకు వినియోగంతో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిందని వెల్లడించారు. రాబోయే సీజన్‌లో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతులు, గృహ వినియోగదారులు, వాణిఽజ్య విద్యుత్‌ వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా నాణ్యమైన విద్యుత్‌ నిరంతరం అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 11కేవీ ఫీడర్లపై విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడినప్పుడు సంబందిత సిబ్బంది వెంటనే స్పందించి లోపాలను గుర్తించి మరమ్మతులు చేయాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ములుగు సర్కిల్‌ ఎస్‌ఈ భిక్షపతి, డీఈ రాజు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ తనిఖీ

మంగపేట : మండల పరిధిలోని మంగపేట, మల్లూరులోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లను టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండి కర్నాటి వరుణ్‌రెడ్డి క్షేత్రస్థాయిలో బుధవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా సబ్‌స్టేషన్ల నిర్వహణ, విద్యుత్‌ పరికరాల పనితీరు , ప్రస్తుత విద్యుత్‌ సరఫరా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయానికి విద్యుత్‌ అధిక వినియోగంతో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని వెల్లడించారు. 11 కేవీ ఫీడర్లపై అంతరాయాలు ఏర్పడితే త్వరగా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణమే మార్చి పంటలకు నష్టం కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

సీఎండీ వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement