నూతన పర్యాటక విధానాన్ని రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

నూతన పర్యాటక విధానాన్ని రూపొందించాలి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

ములుగు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే పండుగలతో పాటు నూతన పర్యాటక విధానాన్ని రూపొందించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఆమె పర్యాటక రంగం అభివృద్ధి, బతుకమ్మ పండుగ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి అంటే కేవలం పెద్ద హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకే పరిమితం కాకూడదని తెలిపారు. చిన్న హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌స్టేల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు వాటిని పర్యాటకశాఖ ద్వారా అధికారికంగా నమోదు చేసే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, పర్యాటక శాఖ నోడల్‌ అధికారి ధర్మనాయక్‌ పాల్గొన్నారు.

వీసీలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement