ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలు చెల్లించాలి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ములుగు రూరల్‌: ప్రభుత్వం ప్రీప్రైమరీ పాఠశాలలో విద్యాబోధన, ఆయాలుగా నియమించిన వారికి నెలవారి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు రవీందర్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేఖ విధానాలతో అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రీపైమరీ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్‌లు, ఆయాలకు వేతనాలను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించడంతో ఉద్యోగ భద్రతకు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లాలో 76 మంది ఇన్‌స్ట్రక్టర్‌లు, ఆయాలను ఎంపిక చేసి ఆర్డర్‌ కాఫీలు అందించకుండా విధులు చేయిస్తుందన్నారు. అనంతరం తెలంగాణ ప్రీ ప్రైమరీ టీచర్స్‌, ఆయా యూనియన్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా సౌలం రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా అంకిత, కోశాధికారిగా సయ్యద్‌ సోని, ఉపాధ్యక్షురాలుగా దరవాత్‌ గౌతమి, సహాయ కార్యదర్శిగా కొయ్యడ మౌనికతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement