భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో దాడి | - | Sakshi
Sakshi News home page

భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో దాడి

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ఏటూరునాగారం: భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో దాడి చేసిన ఘటన ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మహేష్‌ కథనం ప్రకారం.. వెంకటాపురం(కె) మండలం ఉప్పేడు వీరాపురం గ్రామానికి చెందిన కుమ్మరి చంద్రప్రసాద్‌ కొంతకాలంగా రొయ్యూరులోని అత్తగారు అయిన దుర్గం రామక్క ఇంటి వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో చంద్రప్రసాద్‌ తల్లి ఆదివారం మరణించగా సొంత గ్రామం వీరాపురంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం రొయ్యూరుకు చేరుకున్నాడు. ఈక్రమంలో దుర్గం రామక్క, భార్య అంజలి, కొడుకు యేశ్వర్‌ మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా మతిస్థితిమితం కోల్పోయినట్లు ప్రవర్తించిన చంద్రప్రసాద్‌ పక్కనే ఉన్న కొడవలితో అత్త, భార్య, కొడుకుపై విచక్షణరహితంగా దాడి చేసి గాయపర్చాడు. దీంతో వారు అరవడంతో స్థానికులు వచ్చి చంద్రప్రసాద్‌ను తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని చంద్రప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement