ట్రైబల్‌ యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ట్రైబల్‌ యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలు

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ములుగు రూరల్‌: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకలను సమ్మక్క–సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ వైఎల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ విశిష్టతను విద్యార్థినులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ లైన్ల మార్పునకు నిధులు

ములుగు రూరల్‌: ములుగు నియోజకవర్గంలో విద్యుత్‌ లైన్ల మార్పునకు ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నియోజకవర్గ ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యుత్‌శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు లైన్లను మార్పు చేయడానికి ఉపయోగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి

అథ్లెటిక్స్‌లో ప్రతిభ

ఏటూరునాగారం/వాజేడు: 12వ రాష్ట్ర సబ్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లా విద్యార్థినులు ప్రతిభ కబనబర్చి పతకాలు సాధించారు. ఇటీవల కొమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏటూరునాగారంకు చెందిన క్రీడాకారుణులు ట్రయాథ్లాన్‌ ఏలో అక్షర స్వర్ణం, లాంగ్‌ జంప్‌లో హర్షిణి రజతం, ట్రయాథ్లాన్‌ బీలో హర్షిత కాంస్య పతకం సాధించినట్లు కోచ్‌ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు సోమవారం గెలుపొందిన క్రీడాకారులను ఏఎస్పీ మనన్‌భట్‌ అభినందించారు. అలాగే హెచ్‌ఎం ఇర్ప కేశవరావు, గ్రామస్తులు అభినందించి మ రిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

అట్టముక్కలతో టోపీలు

ఏటూరునాగారం: అట్టముక్కలు ఎంటీ.. గొడుగులా నీడను ఇచ్చేది అనుకుంటున్నారు కదా.. కానీ అదే నిజం. ఏజెన్సీలోని రైతులు, కూలీలు, ప్రజలు అక్కడ ఉన్న వనరులను వారికి అనుగుణంగా మార్చుకొని ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంటారు. అందులో భాగంగానే భానుడు భగ భగలతో తాండవిస్తుంటే పంట పొలాల్లో పనిచేసే కూలీలు తట్టుకోలేక ఇలా అట్టలను టోపీలాగా తయారు చేసుకుని తలలకు పెట్టుకుని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, రాంనగర్‌, రొయ్యూర్‌, ఓడవాడ తదితర ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement