వరి వద్దు.. ఆరుతడి పంటలు ముద్దు | - | Sakshi
Sakshi News home page

వరి వద్దు.. ఆరుతడి పంటలు ముద్దు

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ములుగు: రైతులు రబీ సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటలు, బిందు సేద్యంతో పామ్‌ఆయిల్‌ తోటలు, కూరగాయల వంటి పంటలు సాగు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఉన్నతాధికారులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లోని రైతు వేదికల్లో పాల్గొన్న అధికారులు, రైతులకు ఆరుతడి పంటలసాగుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రబీ సీజన్‌లో ఎట్టి పరిస్థితులో రైతులు వరి సాగు చేయొద్దన్నారు. బిందు సేద్యంతో పామ్‌ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోర్వెల్స్‌ రీఛార్జ్‌, తదితర పనులను చేపట్టి జలవనరులను కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు.

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి

రైతులు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ సీహెచ్‌ మహేందర్‌జీ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంపత్‌ రావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు కళాజాత బృందాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు మార్గనిర్దేశం చేయాలన్నారు. కాగా జిల్లాలోని 22 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, గ్రామస్తులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఆర్‌డీఓ రవీందర్‌, డీసీఎస్‌ఓ ఫైజల్‌ హుస్సేన్‌, డీఎండీసీఎస్‌ఓ కృష్ణవేని, డీఎంహెచ్‌ఓ గోపాలరావు, సీపీఓ జవహర్‌, డీపీఆర్‌ఓ రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

వీసీలో మంత్రులు భట్టి, తుమ్మల, పొన్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement