వెంకటాపురం(కె): మున్నూరుకాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల కేటాయించాలని మున్నూరుకాపు పటేల్స్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలో మున్నూరు కాపు సంఘం భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ధనపనేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యంతో పాటు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాల్లో మున్నూరుకాపులు వె నుకబడి ఉన్నామన్నారు. ఇప్పటికైనా ఐక్యపోరాటా లు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు మున్నూరుకాపు సభ్యత్వ నమోదు వెబ్‌సైట్ పోస్టర్లను ఆవిష్కరించారు. వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గైనని రాజన్న పటేల్, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, బెజ్జని సత్తిబాబు, పూర్ణ, నర్సింగుల రామారావు, గార్లపాటి రవి, రమేష్ తదితరులు ఉన్నారు.
మున్నూరుకాపు పటేల్స్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య


