గిరిజన దర్బార్‌లో.. | - | Sakshi
Sakshi News home page

గిరిజన దర్బార్‌లో..

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

ఏటూరునాగారం: గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వ త్సల్‌ టొప్పో అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్‌లో 7 వినతులను పీఓ గిరిజనుల నుంచి స్వీకరించారు. ఇందులో గురుకుల పాఠశాల సమస్యలు 2, ఐటీడీఏ, ఉద్యోగాలు 3, భూ సమస్యలు 2 దరఖా స్తులు వచ్చాయి. మంగపేట మండలం అఖినేపల్లి మల్లారం ప్రాంతంలో గిరిజన, ప్రభుత్వ భూ ముల ఆక్రమణలు, భూముల బదలాయింపులు, మ్యుటేషన్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు పీఓకు వినతిపత్రం అందించారు. పస్రా గ్రామపంచాయతీ పరిధిలోని 18 గదుల తాయ్‌ బజార్‌ అంగడిపేట షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవాలని నేషనల్‌ ఆదివాసీ గిరిజ న అభ్యుదయ సంఘం ప్రతినిధులు దరఖాస్తు సమర్పించారు. మహబూబాబాద్‌, ములుగు రీజి నల్‌ కోఆర్డినేటర్‌ పరిధిలో డిప్యుటేషన్‌ కావాలని, ఉద్యోగం కావాలని, భార్య పనిచేస్తున్న ప్రాంతానికి బదిలీ చేయాలని పలువురు విన్నవించారు. వినతులు పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ ప్రతాప్‌, డీడీ జనార్దన్‌, ఈఈ ప్రవీణ, ఏఓ అనిల్‌ కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కె. క్రాంతికుమార్‌, ఆర్‌సీఓ పద్మిని, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement