హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారికి నువ్వుల నూనె, పూల దండలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం పూజారులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement