మేడారంలో సండే సందడి | - | Sakshi
Sakshi News home page

మేడారంలో సండే సందడి

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

– 8లోu

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దరాజులకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement