ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

ఆసిఫాబాద్‌ రూరల్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్‌ చాంపియన్‌గా కుమురం భీం జిల్లా నిలిచింది. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు పోటీలను ప్రారంభించారు. హోరాహోరీ పోటీల్లో కుమురం భీం జిల్లా 4 గోల్డ్‌ మోడల్‌, 2 సిల్వర్‌, 6 బ్రాంచ్‌ మోడల్‌తో ఓవరల్‌ చాంపియన్‌ను కై వసం చేసుకుంది. ద్వితీయస్థానంలో ములుగు జిల్లా నిలిచింది. కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు విజయ్‌, లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ డీసీసీ అధ్యక్షరాలు సుగణ, బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం, మల్లికార్జున్‌, ఏసీఎంవో ఉద్దవ్‌, డీఎస్‌వో షేకు, నోడల్‌ ఆఫీసర్‌ మీనారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వెంకటేశ్వర్‌ రెడ్డి, అథ్లెటిక్స్‌ కోచ్‌ విద్యా సాగర్‌, అరవింద్‌, పీడీ, పీఈటీ సాంకేతిక సిబ్బంది 200 మంది పాల్గొన్నారు.

విజేతలు వీరే..

అండర్‌–10 బాలుర విభాగంలో:

శివకుమార్‌ (ములుగు), సాయి కుమార్‌ (కామారెడ్డి), రాంచందర్‌ (కుమురం భీం), జగదీష్‌ (ములుగు), లాంగ్‌ జంప్‌లో శివకుమార్‌ (ములుగు), దిలీప్‌ (ములుగు). అండర్‌–12 బాలుర విభాగంలో శివ కుమార్‌ (ములుగు), పవన్‌ (నల్గొండ), పవన్‌ కళ్యాణ్‌ (వరంగల్‌), దీపవత్‌(నల్గొండ) లాంగ్‌ జంప్‌లో ప్రణయ్‌కుమార్‌ (వరంగల్‌), ప్రశాంత్‌ (వరంగల్‌), జావిలిన్‌ త్రోలో అభిషేక్‌ (నల్గొండ), శైలేష్‌(కొత్తగూడెం), అండర్‌ 14 విభాగంలో తుకారాం (కుమురం భీం), విఘ్నేష్‌(నిర్మల్‌) సోను(ఆదిలాబాద్‌), అకాష్‌ (మహబూబ్‌నగర్‌), లాంగ్‌ జంప్‌లో దయాకర్‌ (జోగులాంబ), శ్రావణ్‌ (ఆదిలాబాద్‌) జావిలిన్‌ త్రో కౌశిక్‌ (ములుగు), హిమ్మత్‌ రావు(నిర్మల్‌).

అండర్‌–10 బాలికల విభాగంలో:

శ్రీవల్లి (మేడ్చల్‌), అనుశ్రీ(మేడ్చల్‌), మేఘన (జోగులాంబ), శ్రీవల్లిక (మేడ్చేల్‌) లాంగ్‌ జంప్‌లో యశాషివీ (సిద్దిపేట), కళ్యాణి (కుమురం భీం), అండర్‌–12 విభాగంలో నూరింన్‌ (కరీంనగర్‌), పార్వతి (నారాయణ పేట్‌), శైలు (జోగులాంబ), లాసియా (మహబూబాద్‌), లాంగ్‌ జంప్‌లో భవిత (ఖమ్మం), అధ్య (మేడ్చల్‌), జావిలిన్‌ త్రోలో అభిజ్ఞ (పెద్దపెల్లి), శంకరమ్మ (కుమురం భీం).

అండర్‌ 14 విభాగంలో: సుశీల (హైదరాబాద్‌), వర్ష (హైదరాబాద్‌), శ్రీనిధి (మంచిర్యాల), నందిని (హైదరాబాద్‌), లాంగ్‌ జంప్‌లో ప్రవళిక (కుమురం భీం), అక్షర (ములుగు), జావిలిన్‌ తోలో శృతి (మంచిర్యాల), సోని (హన్మకొండ), ట్రాయత్లాన్‌ యువరాజ్‌ (నాగర్‌కర్నూల్‌) వరుణ్‌ (హన్మకొండ) ప్రథమ, ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నారు.

ఓవరాల్‌ చాంపియన్‌గా కుమురం భీం

ద్వితీయస్థానంలో ములుగు జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement