రావణవధ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రావణవధ ఉత్సవాలు

Oct 12 2026 8:34 AM | Updated on Oct 12 2026 8:34 AM

ములుగు: ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న రావణ వధ, నరకాసుర వధ ఉత్సవాలు ఈ ఏడాది 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాయని, ఉత్సవాల అనంతరం సమితిని ట్రస్ట్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ములుగు మున్సిపాలిటీగా ఏర్పడిన తొలసారిగా నిర్వహిస్తున్న ఉత్సవాలను సభ్యులంతా సమష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జానపద నృత్యాలు, సినిమా పాటలపై గ్రూప్‌ డ్యాన్స్‌లు, బతుకమ్మ నృత్యాలకు అవకాశం కల్పించినట్లూ వెల్లడించారు. ఒక్కో బృందంలో 6 నుంచి 50 మంది పాల్గొనవచ్చని తెలిపారు. సోలో డ్యానన్స్‌లకు అవకాశం లేదని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం రావణాసురవధ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని వివరించారు. పేర్ల నమోదుకు వాంకుడోత్‌ జ్యోతి 9701250210, మాలోత్‌ ప్రేమ్‌ సింగ్‌ 8143101766ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో పెట్టం రాజు, ఆడెపు రాజు, అమర్‌నాథ్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement